ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే…

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా 70 అజెండా అంశాలపై చర్చించిన మంత్రివర్గం… పలు నిర్ణయాలు తీసుకుంది. నేడు ఏపీ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగింది. ఈ మేరకు జరిగిన సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు తెలిపారు.

ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు | AP Cabinet Meeting.. Many  Important Decisions - Telugu Ap, Approval, Cm Jagan, Summit, Important

ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు:
వైఎస్సార్ లా నేస్తం, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ కల్యాణమస్తు, ఈబీసీ నేస్తం కార్యక్రమాలకు ఆమోదం.
ఉగాది సంక్షేమ పథకాలను ఆమోదం.
జగనన్న విద్యాదీవెన చెల్లింపులకు ఆమోదం.
విశాఖలో టెక్ పార్క్ ఏర్పాటుకు ఆమోదం.
లీగల్ సెల్ అథారిటీలో ఖాళీ పోస్టుల భర్తీకి ఆమోదం.
రామాయపట్నం పోర్టులో 2 క్యాపిటల్ బెర్త్ ల నిర్మాణానికి ఆమోదం.
పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు ఆమోదం.
1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల పోస్టుల భర్తీకి ఆమోదం.