ప్రభాస్ 21: ఊహించని సర్‌ప్రైజ్..!

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ప్రభాస్ 21’ చిత్రానికి సంబంధించి ఊహించని సర్‌ప్రైజ్ ని అభిమానులకు విడుదల చేసారు. ప్రభాస్ 21 మూవీలో నటించబోయే హీరోయిన్‌పై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. కాగా, ప్ర‌భాస్ చివ‌రి చిత్రం సాహోతో బాలీవుడ్ భామ శ్ర‌ద్ధా క‌పూర్ తెలుగు తెర‌కి ప‌రిచ‌యం అయిన విష‌యం తెలిసిందే.

ప్ర‌భాస్ 21 చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో పీరియాడిక‌ల్ మూవీగా తెర‌కెక్కించనున్నారు. ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు తన గోపీకృష్ణా మూవీస్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో వంశీ, ప్రమోద్, ప్రశీదలు నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news