చిత్తూరులో కరోనాతో యువకుడు మృతి..!

-

దేశంలో కరోనా విజృభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ మహమ్మారిని అరికట్టడానికి దేశంలో లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ కారణంగా జీవనోపాధి కోసం వెళ్లిన వలస కూలీలు స్వగ్రామాలకు చేరుతున్నారు. తాజాగా బెంగుళూర్ మల్లి లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే కాలినడకన స్వగ్రామానికి చేరుకున్న ఓ వ్యక్తి ఆనందాన్ని కరోనా మహమ్మారి కమ్మేసింది. రెండు రోజుల్లోనే కరోనాతో ప్రాణాలు కోల్పోయిన హృదయవిదారక ఘటన చిత్తూరులో చోటుచేసుకుంది.

corona
corona

వివరాల్లోకి వెళ్తే.. బెంగుళూర్ లాక్ డౌన్ విధించడంతో జులై 14 బయలుదేరిన బాధితుడు. 3 రోజులపాటు కష్టపడి నడిచి 160 కిలోమీటర్లు దూరంలోని స్వగ్రామానికి చేరుకున్నాడు. మార్గమధ్యలోనే అనారోగ్యానికి గురయ్యాడు. నీరసంతో పాటు, జ్వరం రాగా.. గురువారం రాత్రి ఇంటికి చేరాడు. తండ్రితో కలిసి మదనపల్లె జిల్లా ఆసుపత్రికి వెళ్లిన అతడికి వైద్యులు పరీక్షించి, ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అనంతరం అతడి నుంచి ఉంచి స్వాబ్‌ సేకరించి పరీక్షలకు పంపారు. అయితే, శుక్రవారం రాత్రి అతడి పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. శనివారం వచ్చిన ఫలితాల్లో అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news