ఇండియా లేదా దుబాయ్‌.. ఐపీఎల్ జ‌ర‌గ‌డం మాత్రం ప‌క్కా..!

-

క‌రోనా కార‌ణంగా ఈ ఏడాది వేస‌విలో జ‌ర‌గాల్సిన ఐపీఎల్ 13వ ఎడిష‌న్ టోర్నీ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డింది. అయితే అన్‌లాక్‌లో భాగంగా ప్రేక్ష‌కులు లేకుండానే స్టేడియంల‌లో మ్యాచ్‌లు నిర్వ‌హించుకునేందుకు అనుమ‌తులు ఉన్నా.. ప్ర‌స్తుతం ఆట‌గాళ్లు, సిబ్బంది ర‌వాణా.. మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ అంటే.. అది చాలా రిస్క్‌తో కూడుకున్న వ్య‌వ‌హారం. క‌నుక అక్టోబ‌ర్‌, న‌వంబ‌ర్ నెల‌ల్లో ఐపీఎల్‌ను నిర్వ‌హించాల‌ని బీసీసీఐ భావిస్తోంది. అయితే అదే స‌మయంలో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వ‌హించాల్సి ఉంది. కానీ దానిపై ఐసీసీఐ ఎటూ తేల్చ‌డం లేదు. అయితే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ క్యాన్సిల్ అయ్యే ప‌క్షంలో క‌చ్చితంగా ఐపీఎల్‌ను నిర్వ‌హించి తీరుతామ‌ని బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ ఇది వ‌ర‌కే ప‌లు మార్లు స్ప‌ష్టం చేశారు.

india or uae ipl will be held in one of these nations

ఇక ఈ ఏడాదిని ఎట్టి ప‌రిస్థితిలోనూ ఐపీఎల్‌ను లేకుండా ముగించ‌బోమ‌ని గంగూలీ అన్నారు. ఈ క్ర‌మంలో ఐపీఎల్ కచ్చితంగా జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. అయితే అక్టోబ‌ర్ వ‌ర‌కు భార‌త్‌లో ప‌రిస్థితిని బ‌ట్టి బీసీసీఐ నిర్ణ‌యం తీసుకోనుంది. ప‌రిస్థితి మెరుగు ప‌డితే భార‌త్‌లోనే ఐపీఎల్ జ‌రుగుతుంది. లేదా దుబాయ్‌లో ఈ టోర్నీని నిర్వ‌హిస్తారు. ఈ విష‌యంపై బీసీసీఐ చాలా స్ప‌ష్ట‌త‌తో ఉంది. ఇక ఐపీఎల్ అక్టోబ‌ర్‌లో జ‌రిగితే అప్ప‌టిక‌ప్పుడు షెడ్యూల్ వేసుకోవ‌డం కుద‌ర‌దు క‌నుక‌.. ఇప్ప‌టికే షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ఫిక్స్ చేసి పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే భార‌త్‌లో కుద‌ర‌క‌పోతే టోర్నీ 100 శాతం దుబాయ్‌లోనే జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది.

మ‌రోవైపు బీసీసీఐ ప‌లు దేశవాళీ క్రికెట్ టోర్నీల‌ను కూడా ర‌ద్దు చేసింది. డిసెంబ‌ర్ వ‌ర‌కు దేశ‌వాళీ టోర్నీల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపింది. దేశంలో భిన్న ఏజ్ గ్రూపుల్లో మొత్తం 38 దేశ‌వాళీ టీంలు ప‌లు టోర్నీల్లో మ్యాచ్‌ల‌ను ఆడాల్సి ఉంది. దులీప్ ట్రోఫీ, దేవ‌ధ‌ర్ ట్రోఫీ, చాలెంజ‌ర్స్ సిరీస్‌లు, ఇత‌ర టోర్నీల్లో టీంలు ఆడాల్సి ఉంది. కానీ ప్ర‌స్తుతం క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో అన్ని దేశవాళీ సిరీస్‌లు, టోర్నీలు, మ్యాచ్‌ల‌ను ర‌ద్దు చేశారు. డిసెంబ‌ర్ త‌రువాతే వీటిపై నిర్ణ‌యం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news