ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాట్సప్ DPతో భారీ మోసం

-

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాట్సప్ డీపీతో భారీ మోసం చోటు చేసుకుంది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ చిత్రం డీపీగా ఉన్న వాట్సప్ ఖాతా నుంచి డబ్బులు కావాలంటూ వాట్సప్ మెసేజ్ పెట్టారు కొందరు సైబర్ నేరస్థులు. దీంతో రూ. 2 లక్షల అమెజాన్ గిఫ్ట్ కూపన్లు పంపారు తెలంగాణ హైకోర్టు అధికారి. జస్టిస్ సతీ షచంద్రశర్మ తెలంగాణ హైకోర్టులో ప్రధానన్యాయమూర్తిగా పనిచేసి ఇటీవలే ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు.

ఇక్కడి హై కోర్టులో పనిచేస్తున్న శ్రీమన్నారాయణకు ఆయన డీపీ ఉన్న వాట్సప్ ద్వారా మెసేజ్ చేశారు సైబర్ నేరస్థులు. నేనిప్పుడు ప్రత్యేక సమావేశంలో ఉన్నానని డబ్బులు అత్యవసరం. ప్రస్తుతం నా దగ్గరున్న కార్డులన్నీ బ్లాక్ అయ్యాయి. మీకో అమెజాన్ లింక్ పంపిస్తాను.

దానిని క్లిక్ చేసి 2 లక్షల విలువ చేసే గినా కార్డులు పంపించాలి అని చెప్పి మోసం చేశారు సైబర్ కేటుగాళ్ళు. నిజమేనని నమ్మి 2. లక్షల విలువ చేసే గిఫ్ట్ కార్డులు పంపాడు శ్రీమన్నారాయణ. ఆ తర్వాత విషయం బయట పడటంతో.. సైబర్ నేరస్థులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news