పది రూపాయలకే రుచికరమైన బిర్యానీ.. అక్కడ ఫెమస్..

-

పది రూపాయలకు కప్పు టీ కూడా రాని ఈరోజుల్లో రుచికరమైన బిర్యానీ వస్తుందా..ఛాన్స్ లేదు..కానీ మీ అంచనా తప్పు..ఓ వ్యక్తి కేవలం పది రూపాయలకు రుచికరమైన బిర్యానీని అందిస్తున్నారు.. కాస్ట్ తక్కువ ఉన్నా కూడా రుచిలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. అంత రుచిగా ఉంటుందని అక్కడి స్థానికులు అంటున్నారు. ఆ బిర్యాని ఎక్కడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ షాపు హైదరాబాద్‌లోని అఫ్టల్ గంజ్ బస్టాండ్ ప్రాంతంలో ఉంది. దీని యజమాని ఇఫ్తెకార్. ఈ పెద్దాయన అక్కడ చాలా ఫేమస్. బిర్యానీలు ప్లేట్లలో పెడుతూ చాలా బిజీగా కనిపిస్తాడాయన. ఒక పక్క పార్సిళ్లు కూడా రెడీ అవుతుంటాయి. మార్కెట్లో కూరగాయలు అమ్ముకునేవాళ్లు, బస్సుల కోసం వేచి చూసే వాళ్లు,భిక్షగాళ్లు, దారిన పోయే వారు, ఆకలేసే ప్రతి వారు ఇస్తెకార్ షాపు ముందు ఆగుతారు. ఉస్మానియా ఆసుపత్రికి వచ్చే పేదలకు ఈ బిర్యానీ బండి ఎంతో సహకరిస్తుంది. బేగం బజార్లో పనిచేసే కూలీలకు కూడా ఇదే ఫుడ్ పాయింట్..

ప్లేటు బిర్యాని పది రూపాయలకు అమ్ముతున్న ఇఫ్తెకార్ రోజుకు 60 కిలోల బిర్యానీని వండుతారు. దాదాపు నాలుగు పెద్ద కంటైనర్లలో వాటిని తెచ్చిపెడతారు. ఇది పూర్తిగా వెజ్ బిర్యానీ. మొక్కుబడిగా వండుతాడనుకోకండి ఇందులో క్యారెట్లు, గ్రీన్ పీస్, బంగాళాదుంపలు, బీన్స్ వంటి కూరగాయలు నిండుగా వేసి వండుతాడు. ఇఫ్తెకార్తో పాటూ అతని అన్నదమ్ములు కూడా ఇదే పనిలో ఉన్నారు.

అందరూ కలిసే పదిరూపాయల బిర్యానీ షాపును నడుపుతున్నారు. ఈ బిర్యానీ షాపుకు ‘అక్సా బిర్యాని స్టాల్’ అని పేరు పెట్టారు. ఉదయం పదకొండు గంటల నుంచి ఈ బిర్యానీ అందుబాటులో ఉంటుంది..ఇతను రోజుకు 1500 పేట్లు అమ్ముతాడు.కేజీ 60 రుపాయాలకు అమ్ముతాడు. దాంతో ఎక్కువ మంది ఈ ఫుడ్ ను ఎక్కువ మంది తీసుకోని వెళ్తారు..అక్కడ ఉండేదంతా పేదలు, మధ్య తరగతి వారే. వారికి సేవ చేయాలన్న కోణంలో ఈ స్టాల్ ప్రారంభించినట్లు చెబుతున్నారు. పేదలకు సేవ చేయాలని అనుకోనే వాళ్ళు అతనికి కొంత డబ్బులు ఇచ్చి చేయిస్తారట..

Read more RELATED
Recommended to you

Latest news