సరస్వతి పవర్ భూముల రైతులకు న్యాయం జరుగలేదు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

-

సరస్వతి పవర్ భూముల రైతులకు న్యాయం జరుగలేదని  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పల్నాడు జిల్లా మాచవరంలో సరస్వతి పవర్ భూములను తాజాగా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.  వైఎస్ మయాంలో సరస్వతి ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఈ భూముల పై అనేక అనుమానాలుండటంతో విచారణకు ఆదేశించాం. మేము మెతక వైఖరీతో లేమని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఎస్సీలను భయపెట్టి భూములను లాక్కొన్నారు. ప్లాంట్ పేరుతో భూములను లాక్కున్నారు. ఎస్సీ కుటుంబాలను భయపెట్టి 24 ఎకరాలు తీసుకున్నారు.

అదేవిధంగా అటవీ భూములను 400 ఎకరాలను లాక్కున్నారు. సహజ వనరులను అడ్డగోలుగా దోచుకున్నారు. 2009లో 30 ఏల్లకు లీజ్ కు తీసుకున్నారు. మళ్లీ 50 ఏల్లకు పెంచేశారు. సహజ వనరులు ఒకరి సొంతం కాదు. ప్రజలను కాపాడాల్సిన బాద్యత పోలీసులది. కూటమి అధికారంలోకి రాబట్టే భూముల గురించి ప్రశ్నిస్తున్నామని తెలిపారు. వైసీపీ హయాంలో రైతులకు పరిహారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ముడి సరుకు కోసం 1300 ఎకరాలు తీసుకున్నారు. భూములు ఇవ్వమన్న వారిపై దౌర్జన్యానికి దిగారు. ఈ భూములపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news