డేరా బాబాకు జీవిత ఖైదు.. హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు

-

గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా జీవిత ఖైదు విధిస్తూ పంచకులలోని సీబీఐ స్పెషల్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. డేరా సచ్చా సౌదా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది. డేరాబాబాతో సహా మరో నలుగురికి శిక్షను ఖరారు చేసింది. వివరాల్లోకి వెళితే 2002 సంవత్సరంలో డేరా సచ్ఛా సౌదాలో మేనేజర్ గా పనిచేసే రంజిత్ సింగ్ హత్యకు గురయ్యాడు. ఆశ్రమంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై లేఖలు రాశారనే అనుమానంతో రంజిత్ సింగ్ ను దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటనపై కోర్టు 2003లో సీబీఐ విచారణకు ఆదేశించింది. హత్య కేసులో ప్రధాన నిందితుడు డేరాబాబానే అని అన్ని ఆధారాలను సీబీఐ కోర్టు ముందు ఉంచింది. ఈ కేసులో నిందితుడికి మరణి శిక్ష విధించాలని సీబిఐ గట్టిగా వాదించింది. అయితే కోర్టు మాత్రం నిందితుడికి జీవిత ఖైదు విధించింది. గతంలో అత్యాచారం కేసులో గుర్మిత్ సింగ్ దోషిగా తేలడంతో కోర్టు 20 సంవత్సరాల శిక్షను విధించింది. ప్రస్తుతం గుర్మిత్ సింగ్ రోహ్ తక్ జైలులో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news