రేవంత్ రెడ్డి… తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ… ప్రజల్లోకి వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. ఎలాగైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని ధ్యేయంతో పని చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు రేవంత్ రెడ్డి.
ఈ నేపథ్యంలో నే… ఉప్పల్ ఏరియా లో అక్రమంగా నిర్మాణం జరుగుతున్న… ఓ షాపింగ్ మాల్ నిర్మాణంపై మంత్రి కేటీఆర్ కు స్వయంగా రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మీ శాఖలోనే చాలా అవకతవకలు జరుగుతున్నాయంటూ మంత్రి కేటీఆర్ కు చురకలంటించారు రేవంత్ రెడ్డి.
“హైదరాబాద్ మంత్రి అండ… ఉప్పల్ చౌరస్తాలో… అనుమతి లేని అక్రమ నిర్మాణం… ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు…కేటీఆర్ మీ శాఖ బాగోతాల మీద చర్యలుంటాయా..? లేదా మీరూ భాగస్వాములేనా…!?” అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. అయితే రేవంత్ రెడ్డి ట్వీట్ పై స్పందించిన జిహెచ్ఎంసి అధికారులు వెంటనే ఆ షాపింగ్ మాల్ నిర్మాణాన్ని కూల్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయంటూ నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్ మంత్రి అండ…
ఉప్పల్ చౌరస్తాలో…
అనుమతి లేని అక్రమ నిర్మాణం…
ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు…@ktrtrs మీ శాఖ బాగోతాల మీద చర్యలుంటాయా..?
లేదా మీరూ భాగస్వాములేనా…!?@telanganaCMO@CommissionrGHMC pic.twitter.com/zUoiZmQXbE— Revanth Reddy (@revanth_anumula) October 18, 2021