వినాయకుడి ఎలుక వాహనం ఇచ్చే సందేశం ఇదే!

-

ఒక్కో దేవునికి ఒక్కో వాహనం. భారీకాయం కానీ చిన్న మూషిక వాహనం. అయితే దీనిలో పలు రహస్యాలు దాగి ఉన్నాయంటారు మన పండితులు అవేమిటో పరిశీలిద్దాం… వినాయకుని వాహనం మూషకం. ముషస్తేయే అనే ధాతువు మీద మూషకం లేదా మూషికమనే మాట ఏర్పడింది. దీనికి ఎలుక అని అర్థం.ఎలుకని ఓసారి పరిశీలించండి. ఎప్పుడూ చలిస్తూనే ఉండేదీ ఏ క్షణమూ కూడ కదలకుండా ఉండనిదీ ఆ ప్రాణి. నిశ్చలంగా కూచున్నప్పుడు కూడ మూతినో కళ్లనో కదుపుతూనే ఉండే లక్షణం దానిది. ఇక రెండో విషయం ఎక్కడినుండో దొంగతనంగా తెచ్చి బొరియలో దాచిపెట్టుకునే లక్షణం దానిది.

ఈ ఎలుక మీద వినాయకుడు ఉంటాడంటే ఎవరైనా సరే, దొంగబుద్ధితో దాచకు. అనుభవించకుండా నిలవ ఉంచుకోకు! చంచలత్వాన్ని నియంత్రించుకుని నిశ్చలతతో ఉంటే విఘ్నం నీ దరి చేరదు, విజయం నీ చెంత నుంచి వెనక్కు మళ్లదు అని సంకేతార్థం. మూషిక వాహన రహస్యం తెలిసింది కదా!

కేశవ

Read more RELATED
Recommended to you

Latest news