BREAKING: కేసీఆర్ తో మాట్లాడిన మాజీ ప్రధాని దేవెగౌడ.. మతతత్వానికి వ్యతిరేఖంగా పోరాడుతున్నారంటూ కితాబు

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాజీ ప్రధాని దేవేగౌడ ఫోన్ చేశారు. తాజా రాజకీయ పరిణామాలపై ఈ ఇద్దరు నేతలు చర్చించారు. మీరు పెద్ద యుద్ధం ప్రారంభించాని..బీజేపీపై పోరాటానికి మా మద్దతు ఉంటుందని దేవెగౌడ కేసీఆర్ తో అన్నారు. లౌకికవాదాన్ని కాపాడేందుకు అండగా ఉంటామన్నారు దేవేగౌడ. మతతత్వ శక్తులతో పోరాడాలని.. లౌకికవాదాన్ని రక్షించాలని ఇద్దరు నేతలు చర్చించారు. దేశాన్ని కాపాడేందుకు మీ పోరాటం కొనసాగాలని సీఎం కేసీఆర్ తో దేవెగౌడ అన్నారు. త్వరలోనే బెంగళూర్ కు వచ్చి మిమ్మల్ని కలుస్తా అని కేసీఆర్ దేవెగౌడతో అన్నారు. 

ఇప్పటికే ఎన్డీయేతర ముఖ్యమంత్రులు సమావేశం కావాలని అనుకుంటున్నారు. ఢిల్లీా వేదికగా ఈ సమావేశం జరుగబోతోంది. ఇప్పటికే దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఫోన్ చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఢీకొట్టేందుకు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ఎన్డీయే, యూపీయేతర పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. దేశంలో మూడో ప్రత్యామ్నాయానికి ప్రాంతీయ పార్టీలు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news