మాట తప్పారు.. మడమ తిప్పారు.! సీఎం జగన్ పై దేవినేని ఆగ్రహం..!

సీఎం జగన్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూడు రాజధానులు కు సంబంధించిన బిల్లు సహా సీఆర్డిఏ రద్దుకు సంబంధించిన బిల్లులను ఏపీ గవర్నర్ ఆమోదం తెలపడం తో ఆంధ్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఎంతో మంది నేతలు స్పందించారు. అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ విషయమై మాటల యుద్ధం మొదలైంది. అయితే తాజాగా.. దీనిపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…‘‘ఎన్నికల ముందు ప్రజారాజధానిగా అమరావతి ఉంటుందని ప్రజలను నమ్మించారు. నేడు మోసం చేశారు. ఏరు దాటేవరకు ఏటిమల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అంటూ.. మాట తప్పారు.. మడమ తిప్పారు..నాడు మీరు, మీ నాయకులు మాట్లాడిన మాటలకు ప్రజలకు సమాధానం చెప్పండి సీఎం జగన్‌ గారు” అంటూ దేవినేని ట్వీట్ చేశారు.