ఎమ్మెల్సీని తన్నిన మంత్రి : ఆంధ్రాలో గందరగోళం..!

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రగడ కరోనా కన్నా తీవ్రంగా ఉంది. నేతల నోటికి, చేష్టలకి హద్దూ అదుపు లేకుండా పోతుంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ముగిసినట్టుంది.. అందుకే చేతులకి పని చెప్పుకుంటున్నారేమో అని తెలుస్తుంది. ఒకరిపై ఒక దాడి చేసుకునే స్థాయికి రాష్ట్ర రాజకీయాలు వెళ్లిపోయినట్టు కనబడుతున్నాయి. నిన్న ఏపీ శాసన మండలిలో పలు  బిల్లులను ప్రవేశ పెడుతున్న సమయంలో జరిగిన గందరగోళమే దీనికి నిదర్శనం.

అయితే దీనిపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు స్పందించారు. ఎమ్మెల్సీ బీదను మంత్రి వెల్లంపల్లి తన్నారని, తొడగొట్టి మంత్రి అనిల్‌ సవాల్ విసిరారని, దూషణలతో మండలిలో గందరగోళం నెలకొందని ఓ వార్తా పత్రికలో వచ్చిన వార్తలను ఆయన పోస్ట్ చేశారు. ‘పెద్దల సభలో మంటలు.. ఎమ్మెల్సీని తన్నిన మంత్రి.. తొడగొట్టిన మంత్రి.. ఎమ్మెల్సీని ఏరా అన్న మంత్రి.. రాజ్యాంగ సంక్షోభం. ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదంకంటే రాజధాని మార్పు బిల్లే ముఖ్యమా? ఇందుకేనా ఒక్కఛాన్స్ అడిగింది చెప్పండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు’ అని దేవినేని ఉమ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news