కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ప్రముఖ దేవాలయాలు అన్నీ కూడా ఇప్పుడు భక్తులకు షరతులు విధిస్తున్నాయి. భక్తుల నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలోనే కొన్ని కఠిన నిర్ణయాలు ఇక తప్పవు అని దేవాలయ కమిటీలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని మాతా వైష్ణో దేవి ఆలయం కీలక నిర్ణయం వెలువరించింది.
“వైష్ణో దేవి యాత్ర కోసం జమ్మూ కాశ్మీర్ వెలుపల నుండి వచ్చే భక్తులందరికీ వైద్యులు ఇచ్చిన కరోనా వైరస్ నెగటివ్ టెస్ట్ రిపోర్ట్ తో రావాలని స్పష్టం చేసింది. 48 గంటల లోపు చేయించుకున్న టెస్ట్ రిపోర్ట్ తో రావాలి అని ఆదేశాలు ఇచ్చింది. నెగటివ్ టెస్ట్ రిపోర్ట్ లేకుండా, వచ్చే వారు యాత్రకు అనుమతించబడరు” అని జమ్మూ కాశ్మీర్ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రం సీఈఓ రమేష్ కుమార్ ఒక ప్రకటనలో వివరించారు.