భారత వెటరన్ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా వైరస్ నుంచి బయటపడ్డారు. ఆయనకు నేడు చేసిన కరోనా పరిక్షా ఫలితాల్లో కరోనా నెగటివ్ గా నిర్ధారణ అయింది అని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ లో వెల్లడించారు. ఆగస్ట్ 5 న ఆయన కరోనా వైరస్ బారిన పడి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అక్కడి నుంచి ఆయన ఆరోగ్యం విషమం అయింది.
రెండు వారాల క్రితం ఆయన ఆరోగ్యం విషమించింది అని ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. విదేశీ వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు వైద్య చికిత్స అందించారు. ప్రస్తుతం ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో ఎక్మో సపోర్ట్ తో ఆయన కోలుకుంటున్నారు అని వైద్యులు పేర్కొన్నారు. ఆయన కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో దేవుడ్ని ప్రార్ధించారు.