తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఇవాళ పదవీ విరమణ చేయనున్నారు. 36 ఏళ్ల పాటు పోలీస్ డిపార్ట్ మెంట్ లో మహేందర్ రెడ్డి వివిధ హోదాల్లో సేవలు అందించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో డీజీపీ మహేందర్ రెడ్డికి వీడ్కోలు పలకనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురుఐపీఎస్ లు హాజరుకానున్నారు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు డీజీపీ కార్యాలయంలో అంజనీ కుమార్ డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.
రాష్ట్ర డీజీపీ (ఫుల్ అడిషనల్ ఛార్జ్)గా అంజనీకుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. దీని కోసం అధికారులు లక్డీకపూల్‌లోని హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఒంటి గంట మధ్య ముహూర్తం నిర్ణయించారు. ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న మహేందర్‌రెడ్డి పదవీ కాలం శనివారంతో ముగుస్తుంది. ఉదయం ఆయనకు రాజా బహదూర్ వెంకటరామ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో ఫేర్‌వల్ పరేడ్‌తో వీడుకోలు తెలపనున్నారు. కార్యక్రమానికి సీనియర్ ఐపీఎస్ అధికారులు, పోలీస్ సిబ్బంది అటెండ్ అవ్వనున్నారు.