కెసిఆర్ ను మూడు నెలల్లో ఖతం చేస్తాం : ధర్మపురి అరవింద్

నిర్మల్ : హిందూవాహిని సభలో ఎంపీ ధర్మపురి అర్వింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సిఎం కేసీఆర్ ను ఖతం చేయడానికి మూడు నెలల సమయం పట్టదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో హిందువులకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ అని.. దాని నుంచే కేసీఆర్ నేర్చుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ లో గులాబీ అండర్ వేర్లు వేసుకున్న కొందరు పోలీసు అధికారులు రోహింగ్యాలకు పాస్ పోర్టులు ఇస్తున్నారని ఆరోపణలు చేశారు.

రాబోయే బీజేపీ ప్రభుత్వంలో తప్పుడు పాస్ పోర్టు ఇచ్చిన అధికారులను బోనులో నిలబెడతామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి అహంకార పూరితంగా మాట్లాడుతున్నారన్నారు. దళిత జపం చేస్తున్న రేవంత్… కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తమని ప్రకటించగలడా? అని నిలదీశారు. బిఎస్పీ లో చేరిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఆల్ ద బెస్ట్.. చెప్పిన ధర్మపురి అర్వింద్.. కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్లనే ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అయినట్లు రేవంత్ ప్రకటించడం అవమానకరమని నిప్పులు చెరిగారు.