కాంగ్రెస్ పార్టీ డీఎస్ చేరిక వాయిదా… కారణం ఇదే..!

-

ధర్మపురి శ్రీనివాస్.. డీఎస్ సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. తాజాగా ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరతున్నట్లు వెల్లడించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరే ముహూర్తం మాత్రం ఖరారు కావడం లేదు. తాజాగా డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరిక మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం డీఎస్ టీఆర్ఎస్ పార్టీ తరుపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇంకా మరో 6 నెలలు పదవీకాలం ఉంది.

ప్రస్తుతం డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరుదాం అనుకుంటున్న క్రమంలో కోవిడ్ పరిస్థితులతో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ అనారోగ్యంతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఠాగూర్ ఆరోగ్య పరిస్థితులు మెరుగైన తర్వాత డీఎస్ చేరిక ఉంటుందని తెలుస్తోంది. కాగా బడ్జెట్ సమావేశాల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే రాజ్యసభ్య పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతారా.. లేకపోతే రాజీనామా చేయకుండా చేరుతారా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే మరో 6 నెలలు మాత్రమే పదవీకాలం ఉండటంతో.. పదవికి రాజీనామా చేస్తారని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఒక వేళ పదవికి రాజీనామా చేయకుండా చేరితే… టీఆర్ఎస్ పార్టీ అనర్హత వేటు వేయాలని కోరే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news