ఐపిఎల్ లో భాగంగా నిన్న గౌహతి వేదికగా పంజాబ్ మరియు రాజస్థాన్ జట్ల మధ్యన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన పంజాబ్ సేన నిర్ణీత ఓవర్ లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. అయితే.. ఆ లక్ష్యాన్ని ఛేదించలేక.. రాజస్థాన్ ఓడిపోయింది.
ఇక ఈ మ్యాచ్ లో శిఖర్ 86 పరుగులు చేసి నాట్ ఔట్ గా నిలవగా, తన కెప్టెన్సీ తోనూ రాణించి జట్టుకు వరుసగా రెండవ విజయాన్ని అందించాడు. దాదాపు చాలా సీజన్ ల తర్వాత పంజాబ్ స్టార్టింగ్ లో వరుసగా మ్యాచ్ లు గెలవడం పట్ల అభిమానులు మరియు యాజమాన్యం సంతృప్తిగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో ధావన్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్‌లో ధావన్‌కు ఇది 48వ అర్థసెంచరీ కాగా ఓవరాల్‌గా అతనికి ఇది 50వ 50ప్లస్ స్కోరు కావడం విశేషం.ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ తర్వాత అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన రెండో ఆటగాడిగా.. టీమిండియా తరపున తొలి బ్యాటర్‌గా ధావన్ నిలిచాడు.