నన్ను ఒంటరిగా ఎదురుకోలేకనే జిత్తులు, ఎత్తులు, పొత్తులు చేస్తున్నారని ప్రతి పక్షాలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రారంభించారు ఏపీ సీఎం జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. స్కాం లు తప్ప స్కీమ్ లు తెలియని బాబులకు, అభివృద్ధి కనిపించడం లేదని చంద్రబాబు, పవన్ పై ఫైర్ అయ్యారు.
నన్ను ఒంటరిగా ఎదర్కోలేక జిత్తులు,ఎత్తులు,పొత్తులు,పేరు తో కుయుక్తులు పన్నుతున్నారని ఆగ్రహించారు. నవ రత్నాలు తో నేను వస్తుంటే తట్టుకోలేని తోడేళ్ళు ఒక్కటవుతున్నారని సీరియస్ అయ్యారు. నాకు ప్రజలతోనే పొత్తు…జిత్తులు,పొత్తులు కుయుక్తులు నాకు తెలియవు…నిజం మాట్లాడటమే నాకు తెలిసిందన్నారు. మీ ఇంట్లో జరిగిన మంచిని కొలమానం గా తీసుకుని నాకు అండగా ఉండండని కోరారు సీఎం జగన్.