సందేశాలే కాదు.. 5 లక్షలు విరాళం ఇచ్చిన కొరటాల శివ

-

కరోనా వైరస్ నేపధ్యంలో సినీ కార్మికులకు సహాయం చేయడానికి గాను సినీ ప్రముఖులు, స్టార్ హీరోలు అందరూ కూడా ముందుకి వస్తున్నారు. ఇప్పటికే సినీ కార్మికుల కష్టాలు తెలిసిన స్టార్ హీరోలు, చిన్న హీరోలు, దర్శక నిర్మాతలు ఎవరికి వారుగా ముందుకి వచ్చి సహాయం చేస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, మోహన్ బాబు, చిన్న హీరోలు సహా ప్రతీ ఒక్కరు ముందుకి వస్తున్నారు.Koratala Shiva fires on hyderabad voters

ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తున్నారు… రోజు వారి వేతనం తో బ్రతికే సినీ కార్మికులకు తమ వంతుగా ఆర్ధిక సాయం ప్రకటిస్తున్నారు. తాజాగా స్టార్ దర్శకుడు కొరటాల శివ ముందుకి వచ్చి… 5 లక్షల సహాయం చేసారు. రోజు వారి సినీ కార్మికులకు తన వంతుగా 5 లక్షల సహాయం చేస్తున్నా అని… వాళ్ళు అందరూ అందమైన కుటుంబం అని ఆయన పేర్కొంటూ తన ట్విట్టర్ ఎకౌంటు లో ట్వీట్ చేసారు.

కరోనా వైరస్ ని అందరూ సమర్ధవంతంగా ఎదుర్కొందామని ఆయన ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. సాయం కాదు ఇది తోడు అంటూ ట్వీట్ ని నమస్తే తో ముగించారు శివ. ప్రస్తుతం ఆయన చిరంజీవితో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా ఆగిపోయింది. దీనితో ఈ సినిమాకు పని చేస్తున్న కార్మికులు కూడా ఇప్పుడు ఉపాధి లేక కుటుంబాలను పోషించుకోలేక నానా అవస్థలు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news