ధోని… రోహిత్ ని ఎంకరేజ్ చేసినట్టు ఎవరిని చేయలేదు…!

-

అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టింది 2008 లో అయినా రోహిత్ శర్మకు మాత్రం గుర్తింపు వచ్చింది 2013 నుంచే. రోహిత్ అంతర్జాతీయ క్రికెట్ లో అప్పటి నుంచే ఒక సంచలన ఆటగాడు అయ్యాడు. మూడు డబుల్ సెంచరీలు సాధించి చరిత్ర సృష్టించాడు. 264 పరుగులు చేసి ప్రపంచంలోనే అత్యధిక వన్డే బెస్ట్ స్కోర్ నమోదు చేసిన ఆటగాడు అయ్యాడు. మిడిల్ ఆర్డర్ లో వచ్చే రోహిత్ ని ఓపెనర్ గా పంపడం తోనే ఈ ఘనత సాధ్యం అయింది.

అయితే రోహిత్ కెరీర్ ఇలా ఉండటానికి ప్రధాన కారణం టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అని అన్నాడు బిజెపి ఎంపీ మాజీ ఓపెనర్ గౌతం గంభీర్. రోహిత్‌లో దాగిఉన్న ప్రతిభను గుర్తించి అతడిని ప్రోత్సహించాడని, రోహిత్‌ శర్మ ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాడంటే దానికి కారణం ధోనీయే అని చెప్పాడు. సెలక్షన్ కమిటీ, టీమ్ మేనేజ్‌మెంట్ అవకాశం కల్పించినా కెప్టెన్ నుంచి మద్దతు లేకపోతే జట్టులో చోటు కష్టమని చెప్పాడు.

అంతా కెప్టెన్ చేతిలో ఉంటుందని అన్నాడు. ఎన్నో ఏళ్లపాటు ధోని రోహిత్‌కు మద్దతుగా నిలిచాడని పేర్కొన్నాడు. ఏ ఇతర ఆటగాడికి ఇంతమంచి ప్రోత్సాహం దక్కి ఉండకపోవచ్చని గంభీర్ పేర్కొన్నాడు. వాస్తవానికి 2013 కి ముందు రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్ లో వచ్చే వాడు. కాని అతనికి భారీ ఇన్నింగ్స్ లు ఆడాలి అనే కోరిక ఉండేది. దీన్ని గమనించిన ధోని 2013 లో అతనికి ఓపెనర్ అవకాశం ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news