‘100 డయాల్‌’తో దక్కిన నిండు ప్రాణం..!

-

ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని రంగాలకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఇటీవల పోలీస్‌ శాఖలో నూతన పరిజ్ఞానంతో వినియోగిస్తున్న ‘డయాల్‌100’ ఎంతో మెరుగైన సేవలు అందిస్తోంది. తాజాగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోనున్నుట్ల సమాచారం అందుకున్న పోలీసులు కేవలం 4 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకొని ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు. నల్గొండలో జిల్లాలో ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారని స్పీడ్‌ డయల్‌ 100కు ఫోన్‌ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు అక్కడి నుంచి వచ్చిన వివరాలు చెప్పాలని కోరుతుండగా మునుగోడు రోడ్డు అని మాత్రమే చెప్పారు. అయినప్పుటకీ పోలీసులు నూతన టెక్నాలజీ ఉపయోగించి బలవన్మరణానికి పాల్పడుతున్న వ్యక్తిని ప్రాణాలతో కాపాడారు.

 

అప్పటికే వేలాడుతూ..

విధి నిర్వహణలో భాగంగా సాగర్‌ రోడ్డులో ఉండగా మంగళవారం రాత్రి 9.44 ని.లకు. శంకర్‌ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోబోతున్నాడని 100కు సమాచారం రాగానే స్పందించిన సిబ్బంది సదరు వ్యక్తి సమాచారం అడగ్గా తన లొకేషన్‌ మునుగోడు రోడ్డు అని మాత్రమే తెలిపాడు. ఆ తర్వాత మళ్లీ అతడికి ప్రయత్నించగా ఎంతకీ స్పందించలేదు. ఎక్కడి నుంచి కాల్‌ చేశాడో తెలుసుకొని కేవలం 4 నిమిషాల్లోనే సమీపంలోని పోలీసులు అక్కడికి చేరుకుని ఉరికి వేలాడుతున్న శంకర్‌ను కాపాడారు.

అయితే.. అప్పటికే ఉరి వేసుకుని ఉండటంతో సృహ కోల్పోయి ఉన్నాడు. అక్కడిక్కడే పథమ చికిత్స చేసి హుటాహుటినా అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. శంకర్‌ కోలుకున్న తర్వాత కౌన్సెలింగ్‌ ఇచ్చి కుటుంబీకులకు అప్పగించారు. చురుగ్గా వ్యవహరించి వ్యక్తి ప్రాణాలను కాపాడిన డయల్‌ 100 సిబ్బంది సీహెచ్‌ సత్యనారాయణ, పీసీలు సురేశ్‌లను ఉన్నతాధికారులు అభినందించారు. అందుబాటులోకి వచ్చిన స్పీడ్‌ డయాల్‌100 ఎంతో మంది ప్రాణాలు కాపాడుతోందని పోలీస్‌ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news