నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటన
ఇచ్చాక మనకే కాదు ఎవ్వరికీ
దక్కిందేమీ లేదని తేలిపోయింది
ఈ సారి కూడా నిరాశే ఇకపై కూడా నిరాశే
బడ్జెట్ వచ్చిన దగ్గర నుంచి అంతా ఒకే ఒక పదం వాడుతున్నారు. ఆమె ఓఠ్ఠి! పిసినారి అని! బడ్జెట్ ప్రకటన చూసిన దగ్గర నుంచి తమకేం దగ్గలేదని అన్నివర్గాలూ పెదవి విరుస్తున్నాయి. ఆమేం చేయగలరు చెప్పండి. దేశ ఆర్థికం ఆ విధంగా ఉంది మరి! అనవరసరంగా ఆడిపోసుకోకుండా ఆమె ఏమన్నారో వినండి. పన్నుల వసూలు బాగుందని అన్నారా..అంటే ఏంటి తమ సంపద మరియు సంపాదన అంతా పన్నులపైనే ఆధారపడి ఉందని తేల్చేశారు కదా! ఇప్పటిదాకా లక్షా నలభై వేల కోట్ల రూపాయలు పన్నులు వసూలు అయ్యాయని చెప్పారు కదా అంటే ఏంటి చిన్నా,పెద్దా అన్న తేడా లేకుండా ఈ విషయమై వాళ్లంతా సమానత్వం చూపిస్తున్నారనే కదా! కనుక ఈ కథ ఇప్పట్లో తేలదు. ఇప్పట్లో ముగియదు.
బడ్జెట్ వచ్చిన ప్రతిసారీ రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. రాకముందు ఏం కావాలో చెప్పినా కూడా అవి పరిగణనలో ఉండవని గగ్గోలు పెడుతున్నాయి. మేం చెప్పినా వినని వారికి మేం ఎందుకు చెప్పాలి అన్న ఎదురు ప్రశ్న ఒకటి రాష్ట్రాల నుంచి వస్తుంది. బడ్జెట్ ప్రసంగం అంటే అన్నీ అబద్ధాలతో నిండిపోయిన చిట్టా అని తేలిపోయాక ఎవరిని అనుకుని ఏం లాభం చెప్పండి. లాభనష్టాల బేరీజులో లాభం కేంద్రానికి నష్టం రాష్ట్రాలకు.. అలాంటప్పుడు మనం ఏం మాట్లాడుకున్నా కూడా పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు.
ఈసారి బడ్జెట్ దెబ్బకు వంట గది హడలిపోవడం ఖాయం అని తేలింది. వంట నూనెల ధరలు ఒక్కసారిగా పెరిగిపోనున్నాయి. ఇదే మాట మేడం కూడా చెప్పారు. కనుక మేడం చెప్పిన ప్రకారం ఇప్పటి నుంచే కొంత సరకు కొనుగోలు చేసి ప్రిజర్వ్ చేసుకోవాలి లేదంటే కృత్రిమ కొరత పేరిట వ్యాపారులు డ్రామా ఆడనైనా ఆడుతారు. వాళ్లు ఆ విషయంలో కడు సమర్థులు.
బడ్జెట్ కారణంగా పెట్రోలు ధరలు పెద్దగా మారవు అని తేలిపోయింది. మరి ఎన్నికలు అయిపోయాక ఏమయినా మార్పు ఉంటుంది. ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత ఒక్కసారిగా అన్నీ మారిపోతాయి. బీజేపీకి అనుగుణంగా ఫలితాలు వస్తే పర్లేదు లేదంటే అన్నీ మారిపోయి ఒక్కసారి సీన్ రివర్స్ అయిపోతుంది.
బడ్జెట్ కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గాయని అంటున్నారు. అదేం కాదు అంతకుముందు కూడా బంగారం,వెండి ధరలు తగ్గే ఉన్నాయి. కనుక బడ్జెట్ ప్రసంగానికి, పసిడి ధరల తగ్గుదలకూ ఏ సంబంధం లేదని తేలిపోయింది. కనుక పద్దులో చెప్పకమునుపే పుత్తడి ధరలు కిందికి వచ్చి మధ్య తరగతి జీవులను ఆనందింపజేశాయి. ఎలా చూసుకున్నా ఎంత కాదనుకున్నా బడ్జెట్ తో మన జీవితాలు పెద్దగా మారవు. మారాలి అని అనుకోవడం కూడా విడ్డూరం.