వారి బలవంతం వల్లే మహేష్ బాబు హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నారా..?

-

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు మహేష్ బాబుకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం అభిమానులు, సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా మహేష్ బాబుకు విపరీతంగా అభిమానులుగా మారిపోయారు. దీపిక పదుకొనే లాంటి ఇంటర్నేషనల్ హీరోయిన్ కూడా మహేష్ బాబుతో ఒక సినిమాలో నటిస్తే చాలు అని కోరుకుంటుంది. దీన్ని బట్టి చూస్తే మహేష్ బాబుకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే మహేష్ బాబుకు ఈ రేంజ్ లో పాపులారిటీ దక్కడానికి కారణం ఆయన అందం అని చెప్పాలి. దాదాపు నాలుగు పదుల వయసుకు చేరువలో ఉన్నప్పటికీ చెక్కుచెదరని అందంతో దూసుకుపోతున్నారు మహేష్ బాబు.

అయితే మహేష్ బాబు హెయిర్.. ఒరిజినల్ హెయిర్ కాదని.. హెయిర్ ప్లాంటేషన్ అని.. ఇటీవల కృష్ణ పెద్దకర్మ రోజు బయటపడింది . ఎందుకంటే తల్లిదండ్రులు మరణిస్తే వారి కొడుకు గుండు గీయించుకోవాల్సి ఉంటుంది. కానీ మహేష్ బాబు అలా చేయలేదు. దానికి కారణం హెయిర్ ప్లాంటేషన్ అని సమాచారం. అయితే ఆయన హెయిర్ ప్లాంటేషన్ ఎప్పుడు చేయించుకున్నాడు అనే విషయం తాజాగా బయటపడింది. అయితే ప్రస్తుతం ఆయన హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్న మాట వాస్తవమే కానీ పూర్తి జుట్టు ఊడిపోలేదు. తన ఒరిజినల్ హెయిర్ తో అతడు సినిమా వరకు నటించారు మహేష్ బాబు.

పోకిరి సినిమాకు తన లుక్ పూర్తిగా మార్చేశారు మహేష్ బాబు . అతడు సినిమా వరకు కాస్త సీరియస్గా ఉన్న పాత్రలను ఎంచుకున్న మహేష్.. పోకిరి సినిమా వచ్చేసరికి కాస్త అల్లరి చిల్లరగా కనిపించే పండుగాడి పాత్రకు న్యాయం చేయాలి అంటే ఒరిజినల్ హెయిర్ సెట్ కాదని పూరీ జగన్నాథ్ సలహా ఇచ్చారట. అయితే ఇదే విషయాన్ని నమృత కూడా చెప్పడంతో తప్పక మొదటిసారి హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నారు మహేష్ బాబు. అప్పటినుంచి అతడి హెయిర్ స్టైల్ తో పాటు డ్రెస్సింగ్ లో కూడా నమ్రత చాలా మార్పులు తీసుకొచ్చింది. ఏదేమైనా 2005 లో హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నాడు మహేష్ బాబు.

Read more RELATED
Recommended to you

Latest news