దేవి ఎలిమినేషన్ ను నాగ్ తప్పుబట్టాడా?

-

తెలుగులో బిగ్‌బాస్‌ 4 రియాలిటీ షో మూడో వారంకు సంబంధించి ఎలిమినేషన్‌ లో దేవి నాగవల్లి వెళ్లిపోవడం హౌస్‌లోని కంటెస్టెంట్లతో పాటు చూస్తున్న ప్రేక్షకులు కూడా షాక్‌ అయ్యారు. ఇక స్టేజ్‌పైకి వచ్చిన దేవిని ఎలిమినేట్‌ కావడానికి కారణం ఏమై ఉంటుందని హోస్ట్ నాగార్జున అడుగగా, నాకు తెలియదు సార్‌.. అని దుఃఖాన్ని దిగమింగుకుంది. ఆమె ఎలిమినేట్‌ కావడం నాగార్జున కూడా ఆశ్చర్యపోయాడు. బిగ్ బాస్ సర్కిల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దేవీ ఎలిమినేషన్ ను నాగ్ కూడా తప్పుబట్టినట్టు వినికిడి.

ఇంటి సభ్యులకు పలు సూచనలు చేసిన దేవి ఇలా ఎలిమినేట్‌ కావడం ఇంటి సభ్యులు, ప్రేక్షకులు సైతం ఆశ్యర్యపోయారు. హౌస్‌లో సైలెంట్‌గా ఉంటూ తనపని , తన గేమ్‌ తాను ఆడుకుంటు పోయిన దేవి ఎలా ఎలిమినేట్‌ అయ్యిందని ఆలోచనలో పడ్డారు. మొత్తానికి ఈ వారం ఎలిమినేట్‌ అయిన తీరు అందరికి షాక్‌కు గురి చేసింది..

Read more RELATED
Recommended to you

Latest news