షియోమీ కంపెనీ ఎంఐ వాచ్ రివాల్వ్ పేరిట ఓ నూతన స్మార్ట్ వాచ్‌ను భారత్‌లో విడుదల చేసింది. షియోమీకి చెందిన లేటెస్ట్ స్మార్ట్ వాచ్ ఇదే కావడం విశేషం. ఇది 46 ఎంఎం వెర్షన్‌లో లభిస్తోంది. ఇందులో 1.39 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ు ంది. 112 రకాల భిన్నమైన వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉన్నాయి. స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రేమ్‌ను ఏర్పాటు చేశారు. 10 రకాల స్పోర్ట్స్ యాక్టివిటీలను ట్రాక్ చేయవచ్చు. జీపీఎస్ సౌకర్యం కూడా ఈ వాచ్‌లో ఉంది. దీనికి 5 ఏటీఎం వాటర్ ప్రూఫ్ రేటింగ్‌ను ఇచ్చారు. అందువల్ల స్విమ్మింగ్ చేస్తూ కూడా ఈ వాచ్‌ను వాడవచ్చు. ఈ వాచ్ సమారుగా 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది.
షియోమీ ఎంఐ వాచ్ రివాల్వ్ స్పెసిఫికేషన్లు…
* 1.39 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
* 454 × 454 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, బ్లూటూత్ 5.0, జీపీఎస్
* ఆండ్రాయిడ్ 4.4 ఆపైన, ఐఓఎస్ డివైస్‌లకు కంపాటబిలిటీ
* హార్ట్ రేట్ సెన్సార్, స్లీప్ ట్రాకింగ్, ఫిట్ నెస్ ట్రాకింగ్
* 10 స్పోర్ట్స్ మోడ్స్, స్ట్రెస్ లెవల్ ట్రాకింగ్, వాటర్ రెసిస్టెంట్
* 420 ఎంఏహెచ్ బ్యాటరీ, 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్
షియోమీ ఎంఐ వాచ్ రివాల్వ్ మిడ్‌నైట్ బ్లాక్ విత్ స్పేస్ బ్లాక్ స్ట్రాప్, క్రోమ్ సిల్వర్ విత్ నెప్‌ట్యూన్ బ్లూ స్ట్రాప్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ వాచ్ ధర రూ.10,999గా ఉంది. అయితే లాంచింగ్ ఆఫర్ కింద దీపావళి వరకు ఈ వాచ్‌ను రూ.9,999 ధరకే అందిస్తున్నారు. అమెజాన్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోం స్టోర్‌లలో ఈ వాచ్ అక్టోబర్ 6 నుంచి లభిస్తుంది. ఈ వాచ్‌కు గాను ఆస్ట్రల్ ఆలివ్, కాస్మిక్ డస్ట్ మరూన్, లెదర్ స్ట్రాప్‌లను షియోమీ విక్రయించనుంది.