RRR మూవీలో ఎన్టీఆర్ టైగర్ తో కాదా పోరాడింది..ఇరగదీశాడెహే.. వీడియో వైరల్ ..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీ స్టార్లర్ మూవీగా తెరకెక్కిన తాజా చిత్రం ఆర్.ఆర్.ఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంది అంటే దేశ విదేశాలలో కూడా అరుదైన రికార్డులను సృష్టించి భారీ కలెక్షన్లను రాబడుతోంది . ఇక కేవలం థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటిటి వేదికగా కూడా విడుదలైన ఈ చిత్రం మరింత టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకోవడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా లో ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఎఫెక్ట్ పెట్టి అమోఘమైన విఎఫ్ఎక్స్ వర్క్ తో ఎంతో అద్భుతంగా రూపొందించారు. ఇటీవల ఈ సినిమా నుంచి వీ ఎఫ్ ఎక్స్ వర్క్ తో ప్రజలను ఎలా మాయ చేశాడో ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించిన వీ ఎఫ్ ఎక్స్ వర్క్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సన్నివేశాన్ని ఇట్టే చెబుతూ ఉన్నారు అంటే ఇక జక్కన్న ఈ సినిమాను ఎంతలా ప్రేక్షకుల మైండ్ లోకి వెళ్లిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ టైగర్ తో వీరోచితంగా పోరాడే సన్నివేశం థియేటర్లలో చూసినప్పుడు ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ పుట్టుకొస్తాయి. ఎంతలా ఆయన ఇరగదీసాడు అంటే నిజంగా ఆయన నటనా ప్రతిభకు ఇదొక చక్కటి నిదర్శనం అని చెప్పవచ్చు. ఎదురుగా టైగర్ లేకపోయినా టైగర్ ఉన్నట్లు ఊహించుకొని ఎన్టీఆర్ చేసిన నటన అమోఘం అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాకి హైలెట్ ఇదే సన్నివేశం కావడం గమనార్హం.

ఇక తాజాగా ఈ సన్నివేశానికి సంబంధించిన వీ ఎఫ్ ఎక్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టైగర్ కి బదులు అక్కడ ఒక మనిషితో ఎన్టీఆర్ వీరోచితంగా పోరాడడం మనం గమనించవచ్చు. ఒక మనిషిని పట్టుకొని టైగర్ తో పోరాడినట్లు ఎన్టీఆర్ నటించిన నటన చాలా అద్భుతంగా ఉంది అని, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆ వీడియో ను మీరు కూడా ఒకసారి వీక్షించండి.

Read more RELATED
Recommended to you

Latest news