సిద్దార్థ్..కియారా కంటే ముందే అంత మందితో ఎఫైర్ నడిపాడా..?

-

గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ ప్రేమ పక్షుల్లా విహరించిన బాలీవుడ్ జంట కియారా అద్వానీ సిద్ధార్థ మల్హోత్ర ఎట్టకేలకు ఫిబ్రవరి 7వ తేదీన వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా సిద్ధార్థ గురించి కొన్ని వార్తలు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి.. కియారా కంటే ముందు సిద్ధార్థ మల్హోత్ర చాలామందితో ప్రేమలో పడ్డాడు మరి ఆయన వ్యవహారం నడిపిన ఆ హీరోయిన్స్ గురించి ఇప్పుడు చూద్దాం..

అలియా భట్:
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో తొలిసారిగా అలియాబట్, సిద్ధార్థ మల్హోత్రా ఒకేసారి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు . ఈ సినిమా సెట్ లో ఉండగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు రెండు మూడు సార్లు వీళ్ళిద్దరూ ముంబైలో మీడియా కంటపడ్డారు. కానీ ఏమైందో తెలియదు కానీ 2017లో వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు ఆ తర్వాత అలియా రణబీర్ కపూర్ ను వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చింది.

జాక్వలిన్ ఫెర్నాండేజ్:
జాక్వలిన్ సిద్ధార్థ చాలా రోజులపాటు రిలేషన్ లో ఉన్నారు. ఏ జెంటిల్మాన్ మరియు బ్రదర్స్ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ తమ రిలేషన్ పై ఓపెన్ కాలేదు కానీ విడిపోయారు.

తారా సుతారియా:
మర్జవాన్ సినిమాలో కలసి నటిస్తున్న సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పడోసి వాలా లవ్ సినిమా సమయంలో వీరి రిలేషన్ పై తారా మీడియాకు హింట్ కూడా ఇచ్చింది. కానీ వీళ్ళిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు.

కియారా అద్వానీ:
షేర్షా సినిమా సమయంలో కియారతో ప్రేమలో పడ్డ సిద్ధార్థ చాలా రోజులు ఆమెతో సహజీవనం చేశాడు. ఇక గత కొద్ది రోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news