కుషన్సును ఇలా శుభ్రంచేసుకువచ్చు తెలుసా..!

-

దిండు కవర్లను వారం పదిరోజులకు ఒకసారి..క్లీన్ చేసుకుంటూ ఉంటాం..కానీ తొలగించడానికి వీలు లేని దిండ్లు, కుషన్ల సంగతేంటి..మన చెమట, జిడ్డుదనం ఇంకా అన్నీ ఆ కుషన్లకు అంటుకుపోతాయి. అసలు మనం వాడే దిండులపైన బాక్టీరియా లెక్కలేనంత ఉంటుంది. కానీ వీటిని క్లీన్ చేయడానికి వీలు లేదని మనం ఇక ఏం చేయకుండా ఉండిపోతాం..కానీ ఇలాంటి కుషన్లు క్లీన్ చేయడానికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి అంటున్నారు నిపుణులు..అవేటంటే..

వ్యాక్యూమ్ క్లీనర్‌తో..!

వ్యాక్యూమ్ క్లీనర్‌ని దిండు క్లీన్ చేయడానికి ఉపయోగించచ్చు. ఇది దుమ్ము, ధూళి, జిడ్డుదనం, ఇతర అవశేషాల్ని ఆకర్షిస్తుంది. ఇక మరకను తొలగించడానికి డిటర్జెంట్ కలిపిన నీళ్లలో కాటన్‌ క్లాత్‌ని ముంచి, బాగా పిండి మరకపై రుద్దుతూ తుడవాలి. ఆపై ఎయిర్‌ ఫ్రెష్‌నర్‌ని దిండుపై స్ప్రే చేస్తే.. అది పూర్తిగా శుభ్రపడుతుంది.. చక్కటి పరిమళాల్నీ వెదజల్లుతుంది.

‘స్టీమ్‌’ క్లీనింగ్‌

నీటితో శుభ్రం చేయలేని దూది దిండ్లు/కుషన్స్‌, కవర్‌ తొలగించలేని దిండ్లను స్టీమ్‌ క్లీనింగ్‌ పద్ధతి ద్వారా శుభ్రం చేయచ్చంటున్నారు నిపుణులు. వీటి నుంచి ఉత్పత్తయ్యే వేడి వల్ల దిండుపైకి చేరిన క్రిములు, బ్యాక్టీరియా.. వంటివి చనిపోతాయి. తద్వారా అది పూర్తిగా శానిటైజ్‌ అవుతుంది. అలాగే ఈ వేడి వల్ల చెమట, జిడ్డుదనం కారణంగా వెలువడే దుర్వాసనలు కూడా తొలగిపోతాయి. అయితే దీన్ని వాడే క్రమంలో ఎంత వేడిని సెట్‌ చేసుకోవాలి? ఉపయోగించే విధానం.. వంటివన్నీ హ్యాండ్‌బుక్‌ చదివి తెలుసుకొని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండే..

మరకల్ని తొలగించడానికి

డిష్‌సోప్‌, వేడి నీళ్లు కలిపి తయారుచేసిన మిశ్రమంలో పేపర్‌ టవల్‌ లేదా స్పాంజిని ముంచి.. దాంతో మరక ఉన్న చోట అప్లై చేయాలి. కాసేపటి తర్వాత పొడి గుడ్డతో తుడిచేస్తే చాలు.

వేడి నీళ్లు, బేకింగ్‌ సోడా దిండ్లపై పడిన జిడ్డు మరకల్ని తొలగిస్తాయి. ఈ మిశ్రమాన్ని మరక ఉన్న చోట అప్లై చేసి కాసేపు అలాగే వదిలేయండి. తర్వాత పొడి గుడ్డతో తుడిస్తే మరక వదిలిపోతుంది.

అలాగే జిడ్డు మరకల్ని తొలగించడానికి కార్న్‌స్టార్చ్‌ని సైతం ఉపయోగించచ్చు. దీన్ని మరకపై చల్లి పావుగంట పాటు వదిలేయాలి. ఆపై కాస్త తడి చేసిన గుడ్డతో ఈ స్టార్చ్‌ని పూర్తిగా తొలగిస్తే సరిపోతుంది.

ఇక ఎలాంటి మరకనైనా తొలగించే శక్తి వెనిగర్‌కు ఉంది. వెనిగర్‌, నీళ్లు కలిపి తయారుచేసిన మిశ్రమంతోనూ పైన చెప్పినట్లు..దిండ్లపై పడిన మరకల్ని సులభంగా తొలగించచ్చు.

అలాగే దిండ్లపై పడిన సిరా మరకలు అంత త్వరగా వదిలిపోవు. అలాంటప్పుడు మరకపై రబ్బింగ్‌ ఆల్కహాల్‌ అప్లై చేసి కాసేపటి తర్వాత పొడి గుడ్డతో తుడిచేస్తే మరక క్రమంగా తొలగిపోతుంది.

ఈ క్లీనింగ్‌ పద్ధతుల వల్ల దిండ్లపై పడిన మరకలు తొలగిపోవడమే కాదు.. వాటి రంగు వెలిసిపోకుండా, నాణ్యత తగ్గకుండానూ జాగ్రత్తపడచ్చు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news