ఒకప్పుడు ఏటీఎం అంటే..పైసలు తీసుకోనికే వాడేవాళ్లం.. కానీ ఇప్పుడు రకరకాల ఏటీఎంలు వస్తున్నాయి.. హైలెట్ ఏంటంటే.. అసలు డబ్బులు వచ్చే ఏటీఎంలో డబ్బులు రావడంలా..! యూపీ ప్రభుత్వం హెల్త్ ఏటీఎంలను పెట్టింది.. మొన్నటికి మొన్న భాగ్యనగరంలో బంగారు ఏటీఎంను పెట్టారు.. తాజాగా డీజీల్ ఏటీఎం కూడా వచ్చేసింది..ఇంటికి వచ్చి ఇంధనం నింపుతాయి. వాటిని మొబైల్ యాప్ ద్వారా ఆపరేట్ చెయ్యవచ్చు. అలాంటి ఓ ఏటీఎంను.. గుజరాత్ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. అది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
మీకు డీజిల్ లేదా ఇథనాల్ కావాలంటే.. బంకుకు వెళ్లాల్సిన పనిలేదు. మీ మొబైల్‌లోని యాప్‌లో ఆర్డర్ ఇస్తే చాలు.. మీ ఇంటికే డీజిల్ ఏటీఎం వ్యాన్ వస్తుంది. దాంతో మీరు మీ కారుకు ఇంటి దగ్గరే డీజిల్ పోయించుకోవచ్చు. ఈ ATMలో.. డీజిల్ కల్తీ లేనిది వస్తుంది.. దొంగలు దోచుకునేందుకు వీలులేకుండా ఉంటుంది. డీజిల్ కోసం డబ్బు చెల్లింపు ఆన్‌లైన్‌లో జరిగిపోతుంది. స్వచ్ఛమైన లిక్విడ్ పొందేందుకు వీలవుతుంది.
ప్రస్తుతం కాశ్మీర్, కన్యాకుమారి మధ్య 280 డీజిల్ ATMలు పనిచేస్తున్నాయి. ఒక్కో దాంట్లో 1,000 నుంచి 2,000 లీటర్ల నిల్వ సౌకర్యం ఉంటుంది. 6,000 లీటర్ల సామర్థ్యం గల ట్రక్కులు కూడా అందుబాటులో ఉన్నాయి.. ప్రస్తుతం వీటిలో డీజిల్ మాత్రమే లభిస్తోంది. త్వరలో పెట్రోల్ కూడా లభించేలా చేయబోతున్నారు. దేశంలో డీజిల్ ఏ ధరకు లభిస్తుందో, అదే ధరకు వీటి ద్వారా కూడా వస్తుంది.. ఇంటి నుంచే పొందే వీలు ఉండటమే ఇక్కడ ప్రత్యేకత. పెట్రోల్ బంకులు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఈ వ్యాన్‌లు సులభంగా డెలివరీ చేయగలవు.
ఇలాంటి ఏటీఎంలు దేశమంతటా వస్తే..చాలా బాగుంటుంది.. మనం ఎక్కడికైనా వెళ్లినప్పుడు.. సడన్‌గా బైక్‌లో పెట్రోల్ అయిపోతుంది.. దాని వల్ల ఇబ్బందిపడతాం.. ఇక ఫ్యామిలీతో వెళ్లినప్పుడు అయితే ఇంకా కష్టం.. అలాంటప్పుడు ఇలా మొబైల్ యాప్ ద్వారా పెట్రోల్ కావాలంటే పెట్రోల్, డీజిల్ కావాలంటే డీజిల్ కావాలంటే డీజిల్ ఆర్డర్ చేస్తే.. క్షణాల్లో వచ్చి ఇస్తే భలే ఉంటుంది కదా..! అయితే వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది.. అటు ప్రమాదాలు జరగకుండా..ఇంకా చోరీలు కూడా జరగకుండా..!