దిల్ రాజు, దళపతి విజయ్.. పారితోషికం పీక్స్..

-

తమిళ నటుడు దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుందన్న వార్తలు వచ్చాయి. తెలుగులో ఇప్పుడిప్పుడే మార్కెట్ సంపాదించుకుంటున్న విజయ్ తో తెలుగు దర్శకుడు సినిమా తీస్తుండడంతో అందరిలోనూ చర్చ మొదలైంది. తెలుగు, తమిళంలో తెరకెక్కనున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండడం విశేషం. ప్రస్తుతానికి ఈ కాంబినేషన్ సినిమాపై అధికారిక ప్రకటన రానప్పటికీ మరికొద్ది రోజుల్లో అధికారికంగా వెల్లడి చేస్తారని తెలుస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి విజయ్ పారితోషికం పీక్స్ లో ఉందట. ఇప్పటి వరకు ఏ హీరోకూ ఇవ్వనంత పారితోషికాన్ని దిల్ రాజు ఇస్తున్నాడట. దాదాపుగా 90కోట్ల రూపాయాలని పారితోషికంగా ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ తెలుగు హీరోకి దిల్ రాజు అంత మొత్తంలో చెల్లించలేదు. విజయ్ కి ఉన్న మార్కెట్ కారణంగా అంత మొత్తం ఇవ్వడం పెద్ద నష్టమేమీ కాదని భావిస్తున్నారట. పారితోషికమే ఆ రేంజులో సినిమా బడ్జెట్ మరే రేంజులో ఉంటుందో మరి.

Read more RELATED
Recommended to you

Latest news