వివాదంలో దిల్ రాజు కు ఊహించని సపోర్ట్ దక్కిందా.!

-

ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు  స్టార్ హీరో దళపతి విజయ్ తో మన డైరెక్టర్ వంశీ పైడిపల్లి ని తో తమిళ్ లో వారీసు గా తెలుగు లో వారసుడుగా  అత్యంత భారీ స్థాయిలో  సినిమా నిర్మిస్తున్నారు.హీరో విజయ్ కి వున్న  రెండు రాష్ట్రాల్లో వున్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని తెలుగు తమిళ భాషల్లో సంక్రాంతికి కానుక గా  జనవరి 12న విడుదల చేస్తున్నారు. అప్పుడే హీరో అజిత్ సినిమా వలిమై కూడా అప్పుడే రిలీజ్ కు సిద్దంగా ఉంది.

ఇక ఒక ఇంటర్వ్యూ లో దిల్ రాజు  చేసిన కామెంట్స్ ఇప్పుడు తమిళనాడు లో  విజయ్ మరియు అజిత్ మధ్య గొడవలు జరిగేలా చేసాయి.విజయ్  అందరికంటే పెద్ద స్టార్. తమిళంలోి ఆయనకు పెద్ద మార్కెట్ వుంది. అన్న వ్యాఖ్యలు దీనికి మూల కారణం. అసలే ఫ్యాన్స్ మధ్య విపరీతంగా గొడవలు జరిగే తమిళనాడు లో ఇది అగ్నికి ఆజ్యం పోసింది.

ఈ కామెంట్స్ మేము ఒప్పుకొం అని అజిత్ ఫ్యాన్స్ దిల్ రాజు పై మండి పడ్డారు. ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ మధ్య మాటల యుద్ధం మంటలు రేపుతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే పెద్ద యుద్దమే జరుగుతోంది.ఇదిలా ఉంటే అజిత్ మూవీ  దర్శకుడు హెచ్ వినోద్ విజయ్ గురించి ఆయన గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో వినోద్ మాట్లాడుతూ.. తను అజిత్ తో రూపొందించిన సినిమా చాలా సార్లు చూశానని అందుకే ముందు విజయ్ వారసుడు ని చూడాలని అనుకుంటున్నానని హెచ్ వినోద్ చెప్పుకొచ్చారు. దానితో దిల్ రాజు, విజయ్ ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news