జవాన్ కోసం దిల్ రాజు భారీ డీల్.. వర్కౌట్ అవుతుందా..?

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు కథ బాగుంటే కలెక్షన్లు వాటంతట అవే వస్తాయి అని నమ్మే నిర్మాతలలో ఈయన కూడా ఒకరు అని చెప్పవచ్చు. కథల ఎంపిక విషయంలో పర్ఫెక్ట్ గా ఆలోచించే దిల్ రాజు తాను ఎంచుకున్న సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయడమే కాదు నిర్మిస్తూ భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రంపై ఆయన కన్ను పడినట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను చాలా గ్రాండ్గా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే షారుక్ ఖాన్ పఠాన్ సినిమా ద్వారా భారీ విజయాన్ని సొంతం చేసుకొని దేశవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ వసూలు రాబట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సౌత్ హీరోలందరూ పాన్ ఇండియా స్టార్లుగా గుర్తింపు తెచ్చుకుంటున్న నేపథ్యంలో..బాలీవుడ్ హీరోలు కూడా తెలుగుతోపాటు వివిధ భాషల్లో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు . అందులో భాగంగానే సల్మాన్ ఖాన్ ఇటీవల తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కిసీ కా భాయ్ కిసీ కా జాన్ అనే సినిమా చేశారు.అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఇప్పుడు షారుక్ ఖాన్ ఏకంగా తమిళ దర్శకుడితోనే జవాన్ సినిమా చేస్తున్న నేపథ్యంలో ఎలాగైనా సౌత్ మార్కెట్లో మంచి క్రేజ్ పొందాలని చూస్తున్నారు. ఈ క్రమంలోని ఈ సినిమాకు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో బిజినెస్ జరిగిందని సమాచారం. తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమా హక్కులను కొనుగోలు చేయడానికి భారీ ప్లాన్ చేయగా.. అందులో భాగంగానే ఆయన ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా పఠాన్ విజయం సాధించడంతో దిల్ రాజు జవాన్ సినిమాను భారీ ధరకు డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా గనుక విజయం సాధిస్తే దిల్ రాజు అంచనాలు నిజమవుతాయని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news