విపక్షాలకు మరో 8 పార్టీల మద్దతు.. బెంగళూరులో భేటీకి సోనియా గాంధీ

-

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కూటమికి మరో 8 పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే 18 పార్టీలు కూటమిలో చేరగా.. తాజాగా మరుమలర్చి ద్రవిడ మున్నెట్ర కళగం (MDMK) , కొంగు దేశ మక్కల్(KDMK)​, విడుదలై చిరుతైగల్​ కచ్చి (VCK), రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP), ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML)​, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి) పార్టీలు చేరాయి. ఇందులో MDMK, KDMK పార్టీలు 2014 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిలో ఉన్నాయి.

జులై 17, 18 తేదీల్లో బెంగళూరులో జరిగే సమావేశానికి మొత్తం 24 పార్టీల ప్రతినిధులు హాజరు కానున్నారు. కర్ణాటక కాంగ్రెస్​ నిర్వహించే ఈ సమావేశంలో పాల్గొని.. కూటమికి తమ మద్దతును తెలియజేస్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేతో పాటు సోనియా, రాహుల్‌ గాంధీ కూడా భేటీలో పాల్గొనున్నట్లు విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news