ఈ మధ్య కాలంలో యువత ప్రేమే జీవితం అనుకుంటోంది. ప్రేమ లో ఓడిపోతే జీవితం కూడా ఓడిపోయినట్లే అని భావిస్తున్నారు చాలా మంది. అయితే నిజానికి ప్రేమ అనేది జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే. ప్రేమలో ఓడిపోతే జీవితంలో ఓడిపోయినట్లు కాదు అని యువత గ్రహించాలి. మిగిలి ఉన్న జీవితాన్ని చూసి ఆనంద పడాలి. మరో దారి వెతుక్కోవాలి.
అంతేకానీ అందులోనే కుమిలిపోతూ పదేపదే తలుచుకోవడం భావ్యం కాదు. ఇటువంటి వాళ్లకి నిజంగా స్ఫూర్తి నిచ్చాడు ఒక అబ్బాయి. తాను 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రేమ లో ఓడిపోయాడు. మూడేళ్ల పాటు రిలేషన్షిప్ లో ఉండి ఆ తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోక పోవడం వల్ల విడిపోవాల్సి వచ్చింది. అమ్మాయి మాత్రం ఆ ప్రేమ నుంచి బయట పడిపోయింది. కానీ ఈ అబ్బాయి మాత్రం ప్రేమలో కూరుకుపోయి బయటపడలేక పోయాడు.
ఇదే సమయంలో తన సోదరుడు కూడా ప్రేమలో విఫలం అవ్వడం.. ఇరువురు హృదయాలు ముక్కలైపోవడం జరిగింది. అయితే ఇద్దరూ కలిసి ఎంతో బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రేమలో ఓడిపోయానని అందరిలా వీళ్ళు కుంగిపోలేదు.
ఆలోచనతో ఒక కేఫ్ మొదలు పెట్టారు. ఆ కేఫ్ లో టీ పకోరా వంటివాటిని పెట్టి అమ్మడం మొదలు పెట్టారు. నెల రోజుల పాటు కష్టపడి మొత్తానికి కేఫ్ ని ప్రారంభించారు. దిల్ టూటా ఆషిక్ చాయ్ వాలా పేరు కేఫ్ కి పెట్టారు అయితే టీ ఇవ్వడంతోపాటు కస్టమర్లతో మాట్లాడడం లాంటివి చేస్తూ ఉంటారు.
అయితే నిజానికి ఆరోజు ప్రేమలో బయటపడలేక అలా ఉండిపోతే ఈ రోజు కూడా ఏమీ చేయలేక జీవితాన్ని కోల్పోయి ఉండేవాడు. కానీ ఒక మంచి నిర్ణయం తీసుకుని తిరిగి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. హుమన్స్ ఆఫ్ అఫీషియల్ బొంబాయి దీనిని షేర్ చేసింది. నిజంగా ఎందులో అయినా విఫలం అయిన వాళ్ళకి ఇతను ఆదర్శం. ఇలా ఒక దారిలో ఓడిపోతే మరొక దారిని ఎంచుకుని సక్సెస్ ని వెతుక్కోవాలి. సక్సెస్ వచ్చేంత వరకు ప్రయత్నం చేయాలి.