దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత

-

బాలీవుడ్ దిగ్గజ నటుడు, అలనాటి అందాల హీరో దిలీప్ కుమార్ కన్నుమూసారు. ఈ రోజు ఉదయం 7: 30గంటలకు తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దిలీప్ కుమార్, 98సంవత్సరాల వయసులో దేహాన్ని వదిలారు. దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసఫ్ ఖాన్. అప్పట్లో యువతరాన్ని ఉర్రూతలూగించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దేవదాస్ వంటి సినిమాల్లో దిలీప్ కుమార్ హీరోగా నటించారు.

కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దిలీప్ కుమార్ ని ముంబైలోని హిందూజా ఆస్పత్రిలో చేర్పించారు. శ్వాస సంబంధ ఇబ్బందులతో బాధపడిన దిలీప్ కుమార్, బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. బాలీవుడ్ ట్రాజెడీ కింగ్ అని పేరు తెచ్చుకున్న దిలీప్ కుమార్, అలనాటి నటి సైరా భానును వివాహం చేసుకున్నారు. భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ సువర్ణాక్షరాలను లిఖించుకుని, శైలిలో, నటనలో విలక్షణతను కనబర్చిన నటుడు దిలీప్ కుమార్. దిలీప్ కుమార్ హిట్ సినిమాల్లో మొఘల్ ఈ ఆజామ్, రామ్ ఔర్ శ్యామ్, గంగా జమునా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news