CRAZY NEWS:”దిల్” రాజుతో చేతులు కలిపిన “రాఖీ భాయ్ & రోబో”లు ?

-

 

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు టాలెంట్ ఉన్న దర్శకులను మరియు హీరోలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇటీవలే కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తీసిన బలగం అన్న సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా అందరికీ వీర లెవెల్లో పేరును తీసుకువచ్చింది. ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే ఇప్పుడు మరో వండర్ ఫుల్ ప్రాజెక్ట్ కు దిల్ రాజ్ ప్లాన్ చేస్తున్నాడన్న వార్తలు చిత్రపురిలో సందడి చేస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన యష్ మరియు దేశమే మెచ్చిన అద్భుత నటుడు రజినీకాంత్ లతో ఒక మంచి బ్లాక్ బస్టర్ మల్టీస్టారర్ ను తెరకెక్కించడానికి చర్చలు జరుగుతున్నాయట.

మరి ఏ డైరెక్టర్ వీరిద్దరినీ కలిపి సినిమా తీస్తారు అన్న విషయం ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. దిల్ రాజు తో రాఖీ బాయ్ మరియు రోబోలు కలిసి చేసే సినిమా ఎలా ఉండనుందో ?

Read more RELATED
Recommended to you

Latest news