Breaking : బీసీలకు కీలక హామీ ఇచ్చిన నారా లోకేష్‌

-

ఈరోజు టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్ , కమ్మూరులో బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ రావడం లేదన, విదేశీ విద్య పథకం కూడా ఆపేశారని నారా లోకేష్ మండిపడ్డారు. బీసీ రెసిడెన్షియల్ హాస్టల్స్, కాలేజీలు ఏర్పాటు చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని పేర్కొన్నారు. ఫీజుల కోసం కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నాయని, టీడీపీ రాగానే బీసీ రక్షణ చట్టం తెస్తామని నారా లోకేష్ తెలిపారు. న్యాయపోరాట ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని, నియోజకవర్గాల వారీగా బీసీ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు నారా లోకేష్.

No section of people happy under YSRC regime, says Nara Lokesh - Telangana  Today

ప్రస్తుతం నారా లోకేష్ పర్యటన ఉరవకొండ నియోజకవర్గంలో జరుగుతుంది. కూడేరు క్యాంప్ సైట్ నుంచి 62వ రోజు యువగళం పాదయాత్రను నారా లోకేష్ తన పాదయాత్రను ప్రారంభించారు. అంతకు ముందు ఉదయాన్నే సెల్ఫీ విత్ నారా లోకేష్ కార్యక్రమాన్ని చేపట్టారు. వెయ్యి మందితో మొదలైన సెల్ఫీ విత్ నారా లోకేష్ కార్యక్రమం… ఇప్పుడు రెండు వేల మందికి చేరుకుంది. లోకేష్‌తో ఫోటో దిగేందుకు ఉదయం 5.30 కే లోకేష్ క్యాంప్ సైట్‌కి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుంటున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలు తరలివస్తున్నారు. లోకేష్‌తో ఫోటో దిగేందుకు యువత, మహిళలు, వృద్ధులు పోటీ పడుతున్నారు. ఎంత మంది వచ్చినా క్యూలో ఉన్న చివరి వ్యక్తి వరకూ లోకేష్ ఫోటో దిగి పంపిస్తున్నారు. సెల్ఫీ కార్యక్రమంలోనే లోకేష్‌ను కలిసి తమ సమస్యలు తెలిపి వినతి పత్రాలు అందజేస్తున్నారు ప్రజలు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news