లైంగిక వేధింపుల కేసులో డైరెక్టర్ అరెస్ట్

-

సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయి. మొదటి నుంచే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నా.. పెద్దగా బయటికి రానిచ్చే వారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. లైంగిక వేధింపులకు గురైన వారు నిర్భయంగా ముందుకు వస్తున్నారు. తమపై జరిగిన అన్యాయాన్ని బయట పెడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలో ఆస్కార్ గెలుచుకున్న డైరెక్టర్ అరెస్ట్ అయ్యారు.

పాల్ హగ్గీస్
పాల్ హగ్గీస్

ఇటలీకి చెందిన దర్శకుడు పాల్ హగ్గీస్ ‘క్రాష్’ సినిమా ద్వారా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నాడు. అలాంటి దర్శకుడిపై ఓ యువతి లైంగిక వేధింపుల కేసు పెట్టింది. శారీరకంగా హింసించినట్లు ఆ యువతి పేర్కొంది. దీంతో పోలీసులు పాల్ హగ్గీస్‌ను అరెస్ట్ చేశారు. పాల్ ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలి తరఫు న్యాయవాది కోర్టులో తెలిపింది. కాసేపటి పరిచయంలోనే పాల్ లైంగిక వేధింపులకు గురి చేసినట్లు వెల్లడించింది. అయితే, పాల్ తరఫు న్యాయవాది.. తన క్లైంట్ నిర్దోషి అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news