తారక్ గురించి అలాంటి కామెంట్స్ చేసిన డైరెక్టర్ గుణ శేఖర్..!

-

డైరెక్టర్ గుణశేఖర్ అనగానే ఇప్పుడు సమంతా నటించిన శాకుంతలం సినిమా గుర్తుకువస్తుంది. ఇక ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. టాలీవుడ్ లో టాప్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయనకు, ఈయన సినిమాలకు ఒక సపరేట్ స్టైల్ ఉంటుంది. ఆయన సినిమాలలో సెట్స్ హైలెట్స్ అవుతూ ఉంటాయి. ఇక మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో చార్మినార్ సెట్ అంత అద్భుతంగా ఉంటుంది.

ఇక చాలాకాలం తర్వాత అనుష్క నటించిన రుద్రమదేవి సినిమాతో మంచి హిట్ అందుకున్నారు గుణశేఖర్. ఇప్పుడు శాకుంతలం సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో శరవేగంగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు గుణశేఖర్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తారక్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. గతంలో తారక్ తో గుణశేఖర్ బాల రామాయణం సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాముడిగా నటించిన తారక్ తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

తారక్ ఈ స్థాయికి వెళ్తాడని తాను బాల రామాయణం సినిమా టైంలోనే అనుకున్నారని.. తారక్ చాలా హైపర్ ఆక్టివ్ గా ఉంటారు అని తెలిపారు గుణశేఖర్. చిన్నప్పుడే వండర్ కిడ్ లా ఉండేవాడని.. బాల రామాయణం సినిమా కోసం మూడు నెలల వర్క్ షాప్ పెట్టామని.. తారక్ అద్భుతమైన కూచిపూడి డాన్సర్.. ఏది అడిగితే అది చేసే వాడని కూడా తెలిపారు గుణ శేఖర్.

Read more RELATED
Recommended to you

Latest news