షాక్: డైరెక్టర్ లవ్ చేసాడు.! హీరొ పెళ్ళిచేసుకున్నాడు..!!

-

మన జీవితంలో అనుకున్నవన్నీ జరగవు, కొన్ని కోల్పోతాము ,అలాగే కొన్ని మాత్రమే పొందుతాము. కొన్ని సార్లు పొందలేని దాని గురించి బాధపడుతూ వుంటాము. కొంత మంది మనకి ఇది మాత్రమే రాసి పెట్టింది అని సర్డుకుపోతారు. సినిమాల్లో చూపించినట్లు మనం ప్రేమించిన అమ్మాయి మన కళ్ల ముందే వేరే వారిని పెళ్లి చేసుకుంటే ఆ బాధ వర్ణించలేనిది.అదే ఆమె మన ముందు తిరుగుతూ వుంటే అది చాలా దరిద్రంగా వుంటుంది. సినిమా ఫీల్డ్ లో ఈ సంబందాలు కొత్త కొత్త గా వుంటాయి.

 

సినీమా సెలబ్రెటీస్  ఎక్కువ రోజులు కాపురం చేయకుండా, ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి విడాకులు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇలా విడిపోయిన జంటలు చాలా వున్నాయి. అలాగే సినిమా వాళ్ళ లో కొంత మంది పిరికి ప్రేమికులు కూడా వున్నారు. అందులో  ఒక దర్శకుడు లవ్ స్టోరీ మరీ విచిత్రంగా ఉంది. ప్రస్తుతం  సినిమా ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడు ప్రేమ వ్యవహారం గురించి ఇండస్ట్రీలో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈయన కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడట. అది ప్రేమ గా మారిందట. ఆ అమ్మాయిని చూస్తూ దూరం నుంచి చూస్తూ వుండేవాడట మొదటి నుంచి పిరికి మనస్తత్వం గల ఈ డైరెక్టర్ ఆమెకు తన ప్రేమ విషయం చెప్పలేక పోయాడు. ఆమెకు చెప్పడానికి తనకు చాలా భయం వేసిందట.

చివరకు కాలేజీ రోజులు పూర్తయి ఇద్దరూ విడిపోయారు. చివరికి ఆమెకు ఇంట్లో వాళ్ళు వేరే సంబంధం తెచ్చి పెళ్లి చేసారు. అప్పటికి కూడా అతను మాట్లాడకుండా  సైలెంట్ అయిపోయాడట. కట్ చేస్తే ఆమెను చేసుకుంది టాలీవుడ్లో స్టార్ హీరో,ఈ విషయం తెలిసి ఆ డైరెక్టర్ మింగలేక కక్కలేక తనలోనే బాధపడ్డాడట. ఆమె ఆ హీరో ని పెళ్లి చేసుకునే పెళ్లి మంటపంలో  డైరెక్టర్ అక్కడే ఉన్నాడు. కాలేజి లో ప్రేమించిన విషయాన్ని ఆమె కు చెప్పక పోవడం వల్ల ఆమె సినిమా ఫంక్షన్స్ లో కనపడ్డా కళ్ళలోకి సూటిగా చూడలేక పోతున్నాడట. కాని హీరో, డైరెక్టర్ మధ్య సంబందాలు మంచిగానే వున్నాయట. తన డైరెక్షన్లో సదరు హీరో నటించిన సినిమా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఆ హీరో తన భార్యతో లైఫ్ హ్యాపీగా గడిపేస్తున్నారు. సినిమాలో లవ్ సీన్స్ తీసినంత ఈజీ కాదు , నిజ జీవితంలో ప్రేమను డీల్ చేయడం అని పలువురు ఈ విషయం పై వ్యాఖ్యానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news