దర్శకుడు తేజతో చెంప దెబ్బలు తిన్న నిర్మాత కొడుకు..!!

-

దర్శకుడు తేజ గురించి పరిచయం అక్కర్లేదు. మొదట్లో తేజ చిత్రం , నువ్వు నేను, జయం వంటి సూపర్ హిట్స్ ఇవ్వడం తో దర్శకుడి గా ఒక రేంజ్ కు వెళ్ళాడు. కాని తర్వాత చెత్త సినిమాలు చేసుకుంటూ మళ్లీ పాతాళం కు పడిపోయాడు. మళ్లీ  దగ్గుపాటి రానా తో నేనే రాజు నేనే మంత్రి తో మళ్లీ కాంబాక్ అయ్యాడు. మళ్లీ యదావిధిగా  సీత అనే సినిమా తో ప్లాప్ మూటగట్టుకున్నాడు.

దర్శకుడు తేజ తన సినిమా కోసం ఎక్కువుగా కొత్త వారికి ఛాన్స్ ఇస్తాడు. ఇప్పటికే దాదాపు వెయ్యి మందికి పైగా కొత్త నటీనటులను పరిచయం చేశాడు. వారిలో ఉదయ్ కిరణ్, నితిన్,కాజల్, నవదీప్ వంటి వారు మంచి స్టార్లు గా అయ్యారు. అలాగే చాలా మంది టెక్నీషియన్స్ కూడా పరిచయం చేశాడు. అయితే తన స్కూల్ లో మాత్రం నటన రాని వారికి చెంప దెబ్బలు ఖాయం అని చాలా మందికి తెలుసు.

ప్రస్తుతం తేజ అహింస అనే సినిమా తీస్తున్నాడు. సురేష్ బాబు చిన్న కొడుకు, రానా తమ్ముడు అభిరామ్ ను టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు. ఇక అభిరామ్ కు మొదటి సినిమా కాబట్టి నటన విషయంలో సరిగ్గా చేయలేక పోయాడట. దీంతో తేజ అభిరామ్ చెంప చెళ్లుమనిపించినట్లు చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై సురేష్ బాబు తో కూడా మాట్లాడినట్లు, యాక్టింగ్ కోసమే అని సర్ది చెప్పినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news