సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఇటీవల ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు పెరిగిపోవడం పట్ల ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా నేతలు సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా అవినీతిపరులట…కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలను 24 గంటల పాటు నాకు అప్పగిస్తే బీజేపీలోని సగం మంది నేతలు జైల్లో ఉంటారు అని స్పష్టం చేశారు.

AAP alleges Delhi CM put under 'house arrest' | Mint

కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ వారి చేతిలోనే ఉన్నాయని అన్నారు. తమకు వ్యతిరేకంగా అనేక కేసులు పెట్టారని కేజ్రీవాల్ మండిపడ్డారు. మనీష్ సిసోడియా లిక్కర్ స్కాంలో రూ.10 కోట్లు తిన్నాడని అంటున్నారని, వారి చేతుల్లో ఉన్న దర్యాప్తు సంస్థల సాయంతో ఆ విషయం నిరూపించలని నిలదీశారు. ఆప్ నేతలపై 200 కేసులు నమోదు చేసినా, ఒక్కటీ నిరూపించలేకపోయారని స్పష్టం చేశారు. 150 కేసుల్లో తమ నేతలకు క్లీన్ చిట్ వచ్చిందని, మిగిలిన కేసులు పెండింగ్ లో ఉన్నాయని కేజ్రీవాల్ తెలిపారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news