డైరెక్టర్ త్రినాధరావు కు బంపర్ ఆఫర్..!!

-

రవితేజ హీరోగా, యంగ్ హీరోయిన్ శ్రీలీల నటించిన చిత్రం ధమాకా.నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా విడుదల అయిన ఈ సినిమా సంచలనాలు క్రియేట్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తు రవితేజ ను 100 కోట్ల హీరోగా నిలబడాలనుకున్న తన కల సాకారం చేసింది .

ఇక ఈ సినిమా తో రవితేజ కంటే డైరెక్టర్ త్రినాధరావు ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు . ఇప్పుడు పరిశ్రమ లో ఈ డైరెక్టర్ పేరు గాట్టిగా వినపడుతోంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి పెద్ద విజయాన్ని నమోదు చేసే సత్తా ఉన్నట్లు గా పెద్దలు గుర్తించారు. ఇక టాలెంట్ ఎక్కడ ఉన్నా మెగాస్టార్ చిరంజీవి గుర్తిస్తారు. ఇప్పటికే బాబీ తో 200 కోట్లు  వాల్తేరు వీరయ్య గా హిట్ కొట్టాడు.

 ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి త్రినాథ్ కు ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మంచి కథ ఉంటే రెడీ చేసుకోవాలి అని ఆఫర్ ఇచ్చారట. ఇక త్రినాధరావు ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని మెగాస్టార్ దగ్గరికి వెళ్లి ఒప్పిస్తేనే ఈ ప్రాజెక్టు అయితే ఒకే అవుతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే ప్రాజెక్టును డివివి.దానయ్య నిర్మించే అవకాశం ఉన్నట్లు కూడా ఒక టాక్ అయితే వినిపిస్తోంది

Read more RELATED
Recommended to you

Latest news