Breaking : ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు శుభవార్త..

-

ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలకు సంబంధించి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్(టీఎస్‌ఎల్పీఆర్‌బీ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రిలిమ్స్‌లో 7 ప్రశ్నల విషయంలో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆ ప్రశ్నలకు మార్కులు కలపాలని నిర్ణయించింది. ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో మల్టిపుల్ ప్రశ్న విషయంలో అందరికీ మార్కులు కలపాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయనుంది టీఎస్‌ఎల్పీఆర్‌బీ. కోర్టు ఆదేశాల ప్రకారం ఉత్తీర్ణులైన వారికి దేహధారుడ్య పరీక్షలు నిర్వహంచనున్నారు.

ఇందుకోసం అప్పుడు ఉన్న హాల్ టికెట్ నెంబర్లతో లాగిన్ అయ్యేందుకు అవకాశం కల్పించారు. అర్హత సాధించిన అభ్యర్థులు పార్ట్ 2 అప్లికేషన్ చేసుకోవాలని తెలిపింది. ఇది వరకు నిర్వహించిన పీఈటీ, పీఎంటీ పరీక్షలో అర్హత సాధించిన వారు మరో సారి పార్ట్ 2 దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. అంతే కాకుండా.. పీసీ/ఎస్సై లో ఏదో ఒకటి అర్హత సాధించి.. ఇప్పుడు పీసీ/ఎస్సైలో అర్హత సాధించిన వారు పార్ట్ 2 చేసుకోవాలని తెలిపింది. వీరికి మళ్లీ.. ఈవెంట్స్ నిర్వహించమని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news