“టైగర్ నాగేశ్వరరావు” పై డైరెక్టర్ వంశీకి అంత నమ్మకమా ?

-

ఫలితాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అభిమానులను అలరించడానికి రవితేజ ప్రయోగాత్మక కథలను తెరకెక్కిస్తూ వస్తున్నాడు. రవితేజ ఈ మధ్య ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నా, ఆ తర్వాత వచ్చిన రావణాసుర తో అట్టర్ ప్లాప్ ను మూటగట్టుకున్నాడు. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు అనే రియల్ లైఫ్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. ఈ సినిమా గతంలో స్టువర్ట్ పురం ఏరియాలో దొంగ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ వంశీ తెలిపారు. ఈ రోజు ఈ సినిమా నుండి పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వంశి మాట్లాడుతూ ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు సంపాదిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇందులో రవితేజ సరసన, నుపుర్ హీరోయిన్ గా చేస్తోంది.

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుకా దేశాయ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాపై ఎందుకు డైరెక్టర్ వంశీకి అంత నమ్మకం అన్నది అర్ధం కావడం లేదు. కాగా ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news