రేపు ఉత్తరాఖండ్ లో వందే భారత్ ను స్టేట్ చేయనున్న మోదీ…

-

దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ వందే భారత ట్రైన్ లను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. గత నెలలో తెలుగు రాష్ట్రాలల్కు స్వయంగా విచ్చేసి సికింద్రాబాద్ లో వందే భారత్ ను ప్రారంభించారు. కాగా ఇప్పుడు ఆ ట్రైన్ సికింద్రాబాద్ నుండి తిరుపతికి ప్రయాణికులను చేరవేస్తూ మంచి ప్రాముఖ్యతను అందుకుంది. కాగా తాజాగా ఉత్తరాఖం రాష్ట్రంలో మొదటి వందే భరత్ ట్రైన్ ను ప్రారంభించడానికి ముహూర్తం ఖరారైంది. ఈ ట్రైన్ ఉత్తరాఖండ్ రాజధాని అయిన డెహ్రడూన్ నుండి ఢిల్లీ వరకు నడవనుంది. అయితే ఈ ట్రైన్ ను దేశ ప్రధాని నరేంద్ర మోదీ డెహ్రాడూన్ కు వెళ్లకుండానే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రేపు ప్రారంభిస్తారని తెలుస్తోంది.

 

 

 

అయితే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి రేపు డెహ్రాడూన్ కు హాజరు అయ్యి అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటారని అధికారిక సమాచారం. కాగా నరేంద్ర మోదీ లక్ష్యం ప్రకారం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ జూన్ లోగా వందే భారత్ ట్రైన్ ను తీసుకురానున్నారు

Read more RELATED
Recommended to you

Latest news