పార్లమెంట్ భవనాన్ని ప్రధాని ప్రారంభిస్తే హాజరయ్యే ప్రసక్తే లేదు: ఓవైసీ

-

రాజకీయాలలో మతాన్ని బట్టి కొన్ని అభిప్రాయాలూ మారిపోతూ ఉంటాయి. మన దేశాన్ని పట్టి పీడిస్తున్నది ఈ మాత రాజకీయాలు అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా తాజాగా పార్లమెంట్ భవనం ప్రారంభము గురించి దేశ రాజకీయ నాయకులలో చర్చలు జరుగుతున్నాయి,. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని త్వరలోనే ప్రారంభించనుండగా.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేత ప్రారంభం చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తుండగా, తెలంగాణ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఈ పార్లమెంట్ భవనాన్ని ఖచ్చితంగా లోక్ సభ స్పీకర్ ద్వారానే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ప్రధాని కనుక పార్లమెంట్ ను ప్రారంభిస్తే నేను రాను అని తెగేసి చెప్పారు.

మరి విపక్షాలు చెప్పినట్లు , పాలక పక్షాలు చేస్తాయా అంటే సందేహమే. ఇక చాలా మంది నేతలు సైతం ఈ నిరణయాన్ని తప్పు బడుతున్నారు. పైగా దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు కూడా ఆహ్వానము అందలేదని తెలుస్తోందని విమర్శలు చెలరేగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news