టాలీవుడ్ లో ప్రొడ్యూసర్లుగా మారుతున్న డైరక్టర్ల వీరే

-

అవ్వడానికి వారందరు పెద్ద టాప్ డైరెక్టర్లేం కాదు.కాని చేసిన సినిమాలతో వచ్చిన రెమ్యునిరేషన్ తో ప్రొడక్షన్లు పెట్టేస్తున్నారు.కంటెంట్ నచ్చితే కొత్త సినిమాలను ప్రొడ్యూస్ చేసేస్తున్నారు.తాజాగా ఈ లిస్ట్ లోకి మరో దర్శకుడు వచ్చి చేరాడు.

తెలుగు సినీ డైరెక్టర్స్ ఒకప్పటిలా ఏళ్లకు ఏళ్లు పరిశ్రమలో నిలదొక్కుకునే పరిస్థితి లేదు.ఉన్న టైమ్లోనే మంచి సినిమాలు చేసుకోవాలి.వచ్చిన పారితోషకాన్ని ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవాలి.ఇదే ఇప్పటి తరం దర్శకులకు తెలిసింది.చాలా రేర్ గామాత్రమే యంగ్ డైరెక్టర్స్ తాము సంపాదించిన సొమ్మును తమకు లైఫ్ ఇచ్చిన పరిశ్రమ కోసం ఖర్చు చేస్తూ ఉంటారు.తాజాగా అలా ఖర్చు పెట్టడానికి ముందుకొచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.

సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకొచ్చిన ఈ డైరెక్టర్ త్వరలో నాగ్ తో బంగార్రాజు సినిమా చేయబోతున్నాడు.ఈసినిమా చేయడానికి ఓ వైపు సిద్దమవుతూనే మరోవైపు ఓటీటీ కోసం స్మాల్ బడ్జెట్ లో ఓ ఎక్స్ పరిమెంటిక్ ఫిలిం చేస్తున్నట్లు తెలియడంతో ఒక్కసారిగా కళ్యాణ్ కృష్ణ హైలెట్ అయ్యాడు.టాలీవుడ్ లో ప్రొడక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న కొందరు దర్శకులను చూసే కళ్యాణ్ కృష్ణ ఇలా చేస్తున్నాడనే టాక్ నడుస్తుంది.

కళ్యాణ్ కృష్ణ కంటే ముందు సుకుమార్ ,సంపత్ నంది లాంటి దర్శకులు ప్రొడక్షన్ లో సొంత సినిమాలు తీసినవారే.ఇప్పటికే అలా తీసే ప్రయత్నం చేస్తున్నవారే.కాకపోతే డైరెక్టర్లు ప్రొడక్షన్ హౌస్ లు పెట్టి పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు లేవు.అయినప్పటకీ ఇప్పుడున్న డిజిటల్ రైట్స్ ,ఓటీటీ రైట్స్ తో పాటు పాత శాటిలైట్ రైట్స్ తమకు పెట్టిన ఇన్వెస్ట్ మెంట్ తెస్తాయనే కాన్పిడెంట్ తో మాత్రం ఇలా సినిమాల నిర్మాణంలోకి కుర్రు దర్శకులు దిగుతున్నారు.అయితే ఈ ట్రెండ్ రానున్న రోజులలోను మరింతగా కంటిన్యూ అయిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

Read more RELATED
Recommended to you

Latest news